పంటి నొప్పి: తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు...

పంటినొప్పి ఉన్నవారు ఒక గ్లాసు వేడినీటిలో చెంచా ఉప్పును కలిపి, ఆ నీటితో నోటిని బాగా పుక్కిలిస్తే పంటి నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతాయి

ఉప్పునీరు ఒక సహజమైన మౌత్‌ వాష్‌లా బ్యాక్టీరియాపై దాడిచేసి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

కొన్ని మిరియాలను లేదా లవంగాలను మెత్తగా నూరి దానికి కొన్ని నీళ్ళు చేర్చి పేస్టులా తయారు చేసుకోవాలి.

ఈ పేస్టుని కొద్దిగా తీసుకొని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పిని తగ్గిస్తుంది.

లవంగాల్ని మెత్తగా నూరి దానిలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి పేస్టులా చేసుకోవాలి.

ఈ పేస్టుని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పి తగ్గిపోతుంది.

లవంగాల బదులుగా లవంగ నూనె తీసుకొని దానిని దూదికి అడ్డుకొని ఆ దూదిని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.

క్లోవ్‌ ఆయిల్‌ పేరుతో లవంగనూనె చిన్న చిన్న సీసాలలో మెడికల్‌ షాపుల్లోనూ, సూపర్‌ బజార్‌లలోనూ కూడా దొరుకుతుంది.

కొంచెం దూదిని తీసుకొని దానిని నీటిలో తడిపి తరువాత బేకింగ్‌ సోడాలో ముంచి నొప్పి ఉన్న పంటిపైన ఉంచితే నొప్పి తగ్గిపోతుంది.