ఉల్లిపాయను కట్‌ చేస్తున్నారా?

ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలను ముక్కలుగా తరగాల్సి వస్తుంది

అలాంటపుడు ఉల్లిపాయ తొక్కతీసి రెండు ముక్కలుగా చేసి మిక్సీజార్‌లో మూడు సెకన్లు తిప్పితే ఉల్లిపాయ తరుగు రెడీ అవుతుంది.

దీనిని కూరలో వాడుకోవచ్చు. రెండు మూడు సెకన్ల కంటే ఎక్కువ తిప్పకూడదు.

ఒకవేళ ఎక్కువ తిప్పితే ఉల్లిపాయ పేస్టు అవుతుంది.

తొడిమలు కట్‌ చేసి తొక్క తీసిన ఉల్లిపాయలన్నింటిని ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో వేయాలి.

ఈ కంటైనర్‌ డబ్బాను రిఫ్రిజిరేటర్‌లో ఇరవై నిమిషాలు ఉంచాలి.

తరువాత ఉల్లిపాయలను ముక్కలుగా తరిగితే కళ్లలో నీళ్లు రావు.