ప్రస్తుతం నిల్వ ఊరగాయ పచ్చళ్లు పట్టే సమయం ఇది.

ఏ పచ్చడిలోనైనా ముఖ్యంగా ఉండే పదార్థం వెల్లుల్లి.

ఎక్కువ మొత్తంలో పట్టే పచ్చళ్లలో వెల్లుల్లిని కూడా పావుకేజీ నుంచి కేజీ వరకు వేస్తారు.

ఇంత పెద్ద మొత్తంలో వెల్లుల్లి పొట్టు తీయడం కష్టం.

వెల్లుల్లిపాయల నుంచి రెబ్బలను వేరుచేసి, నూనె రాసి గంటసేపు ఎండలో బెట్టాలి.

ఎండిన తరువాత దోరగా వేయించాలి.

వేయించిన రెబ్బలను నెట్‌ క్లాత్‌ లేదా చిన్నచిన్న రంధ్రాలు ఉన్న కూరగాయల నెట్‌ బ్యాగ్‌లో వేసి రెండు చేతులతో నలపాలి.

ఇలా చేస్తే పొట్టు వెంటనే ఊడివస్తుంది.

ఇలా పొట్టుతీసిన వెల్లుల్లి నిల్వ పచ్చడిలో నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.