ఉదయం ఇంట్లో బ్రెడ్‌ తప్ప ఇంకేమీ లేనప్పుడు..బ్రెడ్‌ స్లైసులను పనీర్‌ ముక్కలు లాగా చిన్నచిన్న ముక్కలుగా తరగాలి.

క్యారట్, బీన్స్‌ వేసుకుని పులావ్, ఉప్మాలాంటివి చేసుకుంటే హెల్థీ అండ్‌ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ తయారవుతుంది.

బటర్‌ గట్టిగా ఉండి కట్‌ చేయడానికి వీలు కానప్పుడు...రెండు నిమిషాలపాటు మైక్రోవేవ్‌లో ఉంచాలి.

అప్పుడు బటర్‌ మృదువుగా మారుతుంది.

అప్పుడు సులభంగా కట్‌ చేసి వాడుకోవచ్చు.

పాలు కాచిన తరువాత గిన్నె అడుగు భాగంలో పాలపదార్థం మాడినట్టుగా అంటుకుని ఉంటుంది.

ఇలా కాకుండా ఉండాలంటే..పాలు కాచే గిన్నెలో ముందుగా కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి.

మరిగిన నీళ్లలో పాలు పోసి కాచుకుంటే గిన్నెలో నుంచి పాలు తీసిన తరువాత గిన్నెకు అంటుకోకుండా శుభ్రంగా ఉంటుంది.