టీస్పూను వంటసోడా, టీస్పూను ఉప్పు, టీస్పూను నిమ్మరసం తీసుకుని చక్కగా కలపాలి.

ఆయిల్‌ క్యాన్‌కు లోపల, బయటా ఈ మిశ్రమాన్ని రాసి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

తరువాత స్టీల్‌ స్క్రబ్బర్‌తోను, డిష్‌వాషర్‌తోను ఐదు నిమిషాలపాటు రుద్దాలి.

తర్వాత, వేడినీటితో కడిగితే ఆయిల్‌ క్యాన్‌ జిడ్డు మొత్తం పోయి తళతళా మెరుస్తుంది.

కీర దోసకాయలను తొక్కతీసి ముక్కలు తరిగి పేస్టులా చేసుకోవాలి.

ఈ పేస్టుని చపాతీపొడి పిండిలో వేసి ముద్దలా కలుపుకోవాలి.

ఈ పిండితో చేసిన చపాతీలు తింటే వేసవిలో వేడిచేయదు.

పిండిలో నీళ్లు వేయకుండా కీరా పేస్టుతోనే కలుపుకోవాలి.

కీరాని నేరుగా తినడం ఇష్టపడని వారికి ఇలా చేసి పెట్టడం ద్వారా వారికీ కీరా పోషకాలను అందించవచ్చు