మిగిలిపోయిన గోధుమ పిండి ముద్ద పులవకుండా, ఎటువంటి చెడువాసన లేకుండా ఉండాలంటే ఇలా చేయండి.

పొడి గోధుమ పిండిలో అత్యంత చల్లటి నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి.

ఇలా చేస్తే పిండి మరుసటి రోజు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.

ఫ్రిజ్‌లో పెట్టవచ్చు లేదా పాలిథిన్‌ కవర్‌లో చుట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచుకోవచ్చు.

ఇడ్లీ, దోశపిండి పులిసిపోకుండా ఉండాలంటే... రుబ్బిన పిండిలో కొద్దిగా చల్లటి నీళ్లు పోసి పెడితే పిండి ఎక్కువగా పులవదు.

ఈ పిండిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసుకుంటే మూడునాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది.

మట్టిపాత్రలో అడుగున కొద్దిగా మజ్జిగను చల్లి.. కాచిన పాలుపోసి మూతపెట్టాలి.

ఇలా చేస్తే పాలు త్వరగా తోడుకుని పెరుగు అవుతుంది.

మట్టిపాత్రలో తోడు బెట్టడడం వల్ల పాలలోని నీటిని పాత్ర పీల్చుకుని పెరుగు గడ్డలా వస్తుంది.

నీళ్లు లేకపోవడంతో పెరుగు గడ్డలా ఉండి తియ్యగా ఉంటుంది.