∙బీట్‌రూట్‌ను తినడానికి అందరూ ఇష్టపడరు.

కానీ బీట్‌రూట్‌లోని పోషకాలను ఇంటిల్లిపాదికి అందించాలని ఉంటుంది.

ఇటువంటప్పుడు బీట్‌రూట్‌ను తొక్కతీసి మక్కలు తరిగి, పేస్టులా రుబ్బుకోవాలి.

ఈపేస్టుని చపాతి పిండిలో వేసి కలిపి రోటీ, చపాతీలు చేస్తే చూడడానికి కలర్‌పుల్‌గా ఉండడమే కాదు, రుచికూడా బావుంటుంది.

బీట్‌రూట్‌ను నేరుగా తినలేని వారు ఇలా అయితే సులువుగా తినగలుగుతారు.

ఇంటి అలంకరణలో భాగంగా నీటిలో పూలు వేసి పెడుతుంటాము.

గిన్నెలో నీళ్లుపోసి కొద్దిగా జవ్వాజి పొడివేసి కలపాలి.

తరువాత పూలు వేసి పెడితే ఇళ్లంతా మంచి సువాసన వస్తుంది. జవ్వాజి పొడి సూపర్‌ మార్కెట్లలో దొరుకుతుంది.

పచ్చిమిర్చిని సన్నగా తరిగి, కొద్దిగా వాము, ఉప్పు, అరచెక్క నిమ్మరసం పిండి కలపాలి.

ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేసుకోవాలి.

పెరుగన్నం తినేటప్పుడు ఈ మిశ్రమం నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది.