పాలకూరను వెంటనే వండలేని పరిస్థితుల్లో ఉంటే..?

కాడలు కట్‌ చేసి ఆకుల్ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీళ్లలో కొద్దిగా ఉప్పు, పాలకూర ఆకుల్ని వేయాలి.

వడగట్టి చల్లారనివ్వాలి

చల్లారాక మిక్సీజార్‌లో వేసి నాలుగు రెబ్బలు వెల్లుల్లి, నాలుగు మిరపకాయలను వేసి మెత్తని పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి.

దీనిని ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసుకోవాలి.

ఐదారు రోజులపాటు తాజాగా ఉంటుంది

ఈ పేస్టుతో.. పాలక్‌ రోటీ, పరాటా, పూరీ, పాలక్‌ ఆలూ కుర్మా, పాలక్‌ పనీర్‌లు చేయవచ్చు.

బంగాళ దుంపల మసాలా కూర మరింత రుచిగా రావాలంటే..!

పచ్చి బంగాళదుంపల తొక్కతీసి శుభ్రంగా కడగాలి.

తరువాత ఫోర్క్‌తో దుంపపైన గుచ్చుతూ రంధ్రాలు చేసి.. డీప్‌ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

చల్లారాక మరోసారి డీప్‌ ఫ్రై చేసి మసాలా కూరలో వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది.