రుచికరమైన బొబ్బట్లు

తయారీకి కావాల్సినవి: గోధుమ పిండి – అరకేజీ

శనగపప్పు – పావు కేజీ

బెల్లం తురుము – పావుకేజీ

ఏలకుల పొడి – ఒక టీ స్పూను

నెయ్యి – టేబుల్‌ స్పూన్‌

తయారీ: ∙గోధుమపిండిని చపాతీలకు కలుపుకున్నట్లు కలిపి నానబెట్టాలి

శనగపప్పును ఉడికించి నీరు మొత్తం పోయేటట్లు వడపోసి గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇందులో బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని (పూర్ణం) బాణలిలో వేసి ఒక మోస్తరుగా వేడి చేస్తే... బొబ్బట్లు రెండు – మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

ఒక రోజుకైతే బెల్లం– శనగపప్పు మిశ్రమాన్ని వేడిచేయనవసరం లేదు.

గోధుమ పిండిని నిమ్మకాయంత తీసుకుని ప్రెస్సర్‌లో పూరీలా వత్తాలి

ఇందులో చిన్న గోళీ అంత పూర్ణం పెట్టి అన్ని అంచులూ కలుపుతూ మడతవేయాలి.

ఈ రౌండ్‌ని మరలా ప్రెస్సర్‌లో జాగ్రత్తగా పూరీల్లా వత్తాలి (వత్తేటప్పుడు పూర్ణం బయటకు రాకూడదు).

వీటిని పెనం మీద వేసి తిరగేస్తూ రెండు వైపులా దోరగా కాల్చాలి. కాల్చేటప్పుడు ఒక టీ స్పూను నెయ్యి వేయాలి. నేతితో కాల్చిన బొబ్బట్లు ఘుమఘుమ లాడుతూ నోరూరిస్తాయి.