రొయ్యల – పెసర వడల తయారీ ఇలా

కావలసినవి: పెసలు – 1 కప్పు (నానబెట్టుకోవాలి)

పెద్ద రొయ్యలు – 10

పచ్చిమిర్చి – 6

అల్లం ముక్క – చిన్నది

జీలకర్ర – అర టీ స్పూన్‌

ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు

కొత్తిమీర – అర కప్పు

ఉల్లికాడ ముక్కలు – పావు కప్పు

ఉప్పు – తగినంత

కారం – 1 టీ స్పూన్‌

మెంతి ఆకులు – 2 టేబుల్‌ స్పూన్లు

కరివేపాకు – రెండు రెమ్మలు

నూనె – సరిపడా

బీన్స్‌ – 1 టేబుల్‌ స్పూన్‌ (నానబెట్టినవి)

తయారీ: ముందుగా రొయ్యలు, పెసలు మెత్తగా మిక్సీ పట్టుకుని.. పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కారం వేయాలి

తర్వాత ఉప్పు, మెంతి ఆకులు, కరివేపాకు, రొయ్యలు, ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి

చివరిగా బీన్స్‌ వేసుకుని మరోసారి కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న గారెల్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి.

ఘుమఘుమలాడే రొయ్యల పెసర వడలు రెడీ