ఊదల ఊతప్పం తయారీ ఇలా

కావలసినవి: ఊదలు – కప్పు

కందిపప్పు – అరకప్పు

పచ్చిశనగపప్పు – అరకప్పు

మినపగుళ్లు – గుప్పెడు

ఎండు మిర్చి – నాలుగు

జీలకర్ర – అర టీస్పూను

ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి)

కరివేపాకు – రెండు రెమ్మలు

ఉప్పు – రుచికి తగినంత

నూనె – ఊతప్పం వేయించడానికి సరిపడా

తయారీ: ∙ఊదలు, కందిపప్పు, శనగపప్పు, మినపగుళ్లను శుభ్రంగా కడిగి మూడు గంటలు నానబెట్టాలి

నానిన పప్పులన్నింటిని బ్లెండర్‌లో వేసి, ఎండుమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి మెత్తగా రుబ్బుకోని మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి

మూడు గంటల తరువాత ఉల్లిపాయ ముక్కలను పిండిలో వేసి కలపాలి

వేడెక్కిన పెనంపై కొద్దిగా నూనెవేసి పిండిని ఊతప్పంలా వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని నచ్చిన చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి