ఇడ్లీ, దోశ, చపాతీలోకి.. క్యాప్సికం చట్నీ బాగుంటుంది

కావలసినవి: ఎర్రక్యాప్సికం – పెద్దది ఒకటి

ఉల్లిపాయ – సగం

వెల్లుల్లి రెబ్బలు – రెండు

కరివేపాకు – రెండు రెమ్మలు

ఎండుమిర్చి – ఐదు

చింతపండు –గోళికాయంత

పల్లీలు – పావు కప్పు

బెల్లం తురుము – అటీస్పూను

నూనె – రెండు టీస్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

తాలింపు కోసం: నూనె – అరటీస్పూను

ఆవాలు – అరటీస్పూను

ఇంగువ – చిటికెడు

కరివేపాకు – ఒక రెమ్మ

తయారీ: ∙ముందుగా స్టవ్‌ మీద బాణలిపెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.

కాగిన నూనెలో వెల్లుల్లి, ఎండు మిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయను వేసి రెండు నిమిషాలు వేయించాలి

ఇప్పుడు క్యాప్సికంను ముక్కలుగా తరిగి వేసి మగ్గాక స్టవ్‌ ఆపేసేయాలి ∙

మరో బాణలిలో పల్లీలు వేసి చక్కగా వేయించి పెట్టుకోవాలి

ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్యాప్సికం, ఉల్లిపాయ మిశ్రమం, పల్లీలు, చింతపండు, బెల్లం, రుచికి ఉప్పును మిక్సీజార్‌లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా వేడి నీళ్లు పోసుకోవాలి ∙

తాలింపు పెట్టుకుని రబ్బుకున్న పచ్చడిలో కలిపితే క్యాప్సికం చట్నీ రెడీ.

ఇది ఇడ్లీ, దోశ, చపాతీలోకేగాక ఇతర స్నాక్స్, అన్నంలోకి కూడా చాలా బావుంటుంది