కావలసినవి: పుల్లటి మామిడికాయ ముక్కలు – రెండు కప్పులు (మీడియం సైజు మామిడికాయలు రెండు)

కల్లుప్పు – కప్పు

, కారం – మూడు కప్పులు,

పసుపు – అరటీస్పూను, ఇంగువ – టీస్పూను, పప్పు నూనె – మూడు కప్పులు.

పెసరపిండి – మూడు కప్పులు, ఆవపిండి – టీస్పూను,

ముందుగా మామిడికాయ ముక్కలను శుభ్రంగా తుడిచి టెంక మీద ఉన్న జీడిపొరను తీసేయాలి.

ముక్కలను ఒక గిన్నెలో వేయాలి.

ఉప్పుని ఎండబెట్టి మిక్సీజార్‌లో మెత్తగా గ్రైండ్‌ చేసి, ముప్పావు కప్పు తీసుకుని మామిడి ముక్కల్లో వేయాలి.

కారం, ఆవపిండి, పెసరపిండి, పసుపు కూడా వేసి చక్కగా కలపాలి.

దీనిలో ఇంగువ, మామిడికాయ ముక్కలు వేసి, తరువాత నూనెవేసి చక్కగా కలపాలి.

మూడు రోజుల తరువాత తీసి చూస్తే నూనె పైకి తేలుతుంది.

ఇప్పుడు ఒకసారి కలిపి పొడి జాడీలో వేసి నిల్వచేసుకోవాలి.