సగ్గు బియ్యం, టొమాటోతో రుచికరమైన అప్పడాల తయారీ ఇలా

కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, టొమాటోలు – నాలుగు, పచ్చిమిర్చి – ఆరు అల్లం – అంగుళం ముక్క, నిమ్మకాయ – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు.

తయారీ... ∙సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి.

పచ్చిమిర్చి, అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి పేస్టులా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి

టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలు తరిగి, మెత్తగా రుబ్బుకోవాలి

నానిన సగ్గుబియ్యంలోని నీళ్లను వంపేసి మందపాటి పాత్రలో వేయాలి.

దీనిలో నాలుగు కప్పుల నీళ్లుపోసి సగ్గుబియ్యం జావలా మారేంత వరకు ఉడికించాలి

సగ్గుబియ్యం ఉడికిన తరువాత టొమాటో ప్యూరీ, పచ్చిమిర్చి పేస్టు వేసి మీడియం మంటమీద ఉడికించాలి.

∙తరువాత నిమ్మరసం పిండి ఒకసారి కలిపి స్టవ్‌ మీద నుంచి దించేయాలి.

ఈ మిశ్రమం చల్లారాక కాటన్‌ క్లాత్‌ లేదా, ప్లాస్టిక్‌ షీట్స్‌పై అప్పడం పరిమాణంలో గుండ్రంగా పలుచగా వేసుకోవాలి

పిండి మొత్తం అప్పడాల్లా వేసాక, ఎండబెట్టాలి. రెండు మూడు రోజులపాటు రెండువైపులా చక్కగా ఆరేలా ఎండబెట్టాలి

ఎండిన తరువాత ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి