కావలసినవి: పెద్ద రొయ్యలు – 15 (కారం, గరం మసాలా, చీజ్, ఉప్పు అన్నీ కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల తర్వాత నూనెలో దోరగా వేయించుకుని, మరీ మెత్తగా కాకుండా.. మిక్సీ పట్టుకోవాలి)

ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, బంగాళదుంప తురుము – 1 టేబుల్‌ స్పూన్‌

గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (గోరువెచ్చని నీళ్లు, తగినంత ఉప్పు వేసుకుని, చపాతీ పిండిలా చేసుకుని, అరగంట తర్వాత పూరీల్లా చేసుకుని పక్కనపెట్టుకోవాలి)

ఉప్పు, నూనె – తగినంత

తయారీ: ముందుగా కళాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళదుంప తురుము వేసుకుని వేయించాలి

రొయ్యల మిశ్రమాన్ని జోడించి, గరిటెతో తిప్పి.. చిన్న మంట మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి.

అనంతరం ప్రతి పూరీలో కొంత రొయ్యల–బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకుని.. ఉండల్లా చేసుకుని.. చపాతి కర్రతో పరోటాలా ఒత్తుకోవాలి.

వాటిని నూనెలో ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.

వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది