పెసరప్పడాల తయారీకి కావాల్సిన పదార్థాలు పొట్టుతీసిన పెసరపప్పు పిండి – కప్పు, పొట్టుతీసిన మినప పిండి – అరకప్పు, బేకింగ్‌ సోడా – అరటేబుల్‌ స్పూను

ఉప్పు – రుచికి సరిపడా, ఇంగువ – పావు టీస్పూను, మిరియాలు – టేబుల్‌ స్పూను, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం ∙స్టవ్‌ మీద బాణలి పెట్టి ముప్పావు కప్పు నీళ్లు పోయాలి.

దీనిలో బేకింగ్‌ సోడా, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. దీనిని మరిగించి పక్కనపెట్టుకోవాలి.

పెసర పిండి, మినప పిండిలను రెండింటిని ఒక గిన్నెలో వేయాలి.

మిరియాలను పొడిగా దంచుకుని ఈ పిండిలో వేయాలి. తరువాత రెండు టేబుల్‌ స్పూన్ల ఆయిల్‌ వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి

ఇప్పుడు మరిగించి పెట్టుకున్న బేకింగ్‌ సోడా నీళ్లను పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి.

పిండి ముద్దపై వస్త్రం కప్పి రెండు మూడు గంటలపాటు పక్కన పెట్టకోవాలి

మూడు గంటల తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. మినప పిండితో ఈ ఉండలను పలుచగా గుండ్రంగా వత్తుకోవాలి

రెండురోజుల పాటు చక్కగా ఎండబెట్టాలి. తర్వాత ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి.