కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌ – 300 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు, పసుపు – పావు టీస్పూను, కారం – అర టీస్పూను, గరం మసాల – అర టీస్పూను,

బాదం పప్పు పొడి – టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి – రెండు, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, ఎండబెట్టిన గులాబీ రేకులు – టేబుల్‌ స్పూను,

దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – రెండు, యాలకులు – రెండు, తోకమిరియాలు – టీస్పూను, మిరియాలు – టీస్పూను, జీలకర్ర – పావు టీస్పూను, ఆయిల్‌ – అరకప్పు, గోధుమ రవ్వ – పావు కప్పు,

బాస్మతీ బియ్యం – టేబుల్‌ స్పూను, పచ్చిశనగపప్పు – టేబుల్‌ స్పూను, పెసరపప్పు – టేబుల్‌ స్పూను, మినపపప్పు – టేబుల్‌ స్పూను, డ్రైఫ్రూట్స్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను.

తయారీ: ∙ పప్పులన్నింటిని శుభ్రంగా కడిగి, 3గంటల పాటు నానబెట్టుకోవాలి.

∙నానిన పప్పుని కుకర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చేంతవరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి.

స్టవ్‌ మీద బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి. ఇది వేడెక్కాక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్, క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించి టిష్యూ పేపర్‌ మీద వేసుకోవాలి.

కుకర్‌ ఆయిల్‌ వేసి,వేసి వేడెక్కాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తోకమిరియాలు వేయాలి. తరువాత చికెన్‌ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, కారం, పసుపు వేయాలి

జీలకర్ర, గరంమసాలా, బాదంపప్పు పొడి, గులాబీ రేకులు,మిరియాలు, పచ్చిమిర్చి, రుచికిసరిపడా ఉప్పు వేసి, వేసి కలిపి, నాలుగైదు విజిల్స్‌ రానిచ్చి చల్లారనివ్వాలి.

ఉడికిన చికెన్‌ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని, ఉడికించిపెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించి డ్రైఫ్రూట్స్, కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే చికెన్‌ హలీమ్‌ రెడీ.