కావలసిన పదార్థాలు: పొడవుగా ఉన్న పచ్చిమిరపకాయలు – పావు కేజీ, పెరుగు – అరకేజీ

వాము – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, గాజు జాడీ – ఒకటి.

తయారీ:పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడవాలి

టూత్‌ పిక్‌ లేదా పదునుగా ఉన్న చాకుతో పచ్చిమిర్చి మధ్యలో నిలువుగా ఘాటు పెట్టాలి (చీల్చాలి)

నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలన్నింటిని తొడిమలను పైకి పెట్టి గాజు జాడీలో ఉంచాలి

వాము, పెరుగు, రుచికి సరిపడా ఉప్పుని మిక్సీజార్‌లో వేసి, నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి

రుబ్బుకున్న పెరుగు మిశ్రమాన్ని మిరపకాయలు పెట్టిన గాజు జాడీలో పోయాలి

మిరపకాయలన్నీ పెరుగులో మునిగేలా సర్దుకోని, మూడు రోజులపాటు పక్కన పెట్టుకోవాలి

మిరపకాయలన్నీ పెరుగులో మునిగేలా సర్దుకోని, మూడు రోజులపాటు పక్కన పెట్టుకోవాలి

ఒకటిన్నర రోజుల తరువాత మిరపకాయల్ని తీసి పేపర్‌ మీద వేసి ఎండబెట్టాలి

ఎండిన మిరపకాయలన్నింటిని సాయంత్రం మళ్లీ పెరుగు మిశ్రమంలో వేయాలి మరుసటి రోజు కూడా ఇదేవిధంగా చేయాలి.

ఇలా ఐదు రోజులపాటు చేసిన తరువాత, మిరపకాయల్ని తీసి ఎండలో పెళపెళమనేంత వరకు ఎండబెట్టి, గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

మిరపకాయల్ని తినాలనుకున్నప్పుడు ఆయిల్లో డీప్‌ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే ఏ కూరలోకైనా ఎంతో రుచిగా ఉంటాయి.