కావలసినవి: పండిన టొమాటోలు – కేజీ, పంచదార – ముప్పావు కేజీ, ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, లవంగాలు – ఆరు.

ముందుగా టొమాటోలను శుభ్రంగా కడిగి ఇంటూ ఆకారంలో గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి.

దాల్చిన చెక్క, లవంగాలను పొడి చేసుకోవాలి.∙

టొమాటోలు మునిగేంత నీళ్లను మరిగించాలి.

ఈ నీటిలో గాట్లు పెట్టిన టొమాటోలు వేసి పదినిమిషాలు ఉంచాలి ∙

నీళ్లు చల్లారాక టొమాటోలు తొక్కతీసి, విత్తనాలను పిండేసి సన్నని ముక్కలుగా తరగాలి. ∙

ఈ ముక్కలను బాణలిలో వేసి పదిహేను నిమిషాలపాటు ఉడికించాలి. ∙

నీరంతా∙ఇగిరిపోయాక పంచదార, లవంగాలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి.

టొమాటో మిశ్రమం చిక్కబడేంత వరకు సన్నని మంటమీద తిప్పుతూ ఉడికించాలి. ∙

జామ్‌లా మారాక నిమ్మరసం వేసి తిప్పి స్టవ్‌ ఆపేయాలి.

చల్లారాక గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుచుకోవాలి.

బ్రెడ్, బన్స్, చపాతీల్లోకి ఈ జామ్‌ చాలా బావుంటుంది.