బాదం పోరిడ్జ్‌ (రవ్వ గంజి) తయారు చేసుకోండిలా

కావలసినవి: రవ్వ – 2 టేబుల్‌ స్పూన్‌లు

నీరు– కప్పు

బాదం – 8

బెల్లం పొడి– టేబుల్‌ స్పూన్‌

పాలు– అర కప్పు

తయారీ: బాదం పప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.

నీటిని మరిగించాలి.

పాలను కాచి పక్కన ఉంచాలి.

మందపాటి పెనంలో రవ్వను పచ్చి వాసన పోయేటట్లు కొద్దిసేపు వేయించాలి (రంగు మారే వరకు వేయించరాదు).

రవ్వలో మరుగుతున్న నీటిని పోస్తూ (ఉండలు కట్టకుండా) కలపాలి.

ఇప్పుడు బెల్లం పొడి, బాదం పొడి, వేడి పాలను పోసి కలిపి ఉడకడం మొదలైన తరవాత మూత పెట్టి మంట ఆపేయాలి.

ఇది పాలిచ్చే తల్లికి చక్కటి పోషకాహారం.

గట్టిగా హల్వాలా తినవచ్చు లేదా జావలా గరిటె జారుడు గా ఉండాలంటే పాల మోతాదు పెంచుకోవచ్చు.