టొమాటో సాస్‌ ఇంట్లో ఇలా తయారు చేసుకోండి

కావలసినవి: టొమాటోలు – 2 కేజీలు

వెల్లుల్లి– 15 రేకలు

అల్లం – మూడు అంగుళాల ముక్క

ఎండు మిర్చి – 5

కిస్‌మిస్‌ – అర కప్పు

యాపిల్‌ సిడర్‌ వినెగర్‌ లేదా వైట్‌ వినెగర్‌– అర కప్పు

ఉప్పు– టేబుల్‌ స్పూన్‌

ఆర్గానిక్‌ షుగర్‌ – 6 టేబుల్‌ స్పూన్‌లు (ఆర్గానిక్‌ లేకపోతే మామూలు చక్కెర

సోడియమ్‌ బెన్‌జోయేట్‌ – పావు టీ స్పూన్‌ (టీ స్పూన్‌ వేడి నీటిలో కరిగించాలి

తయారీ: ∙చుక్కలు లేని చక్కటి టొమాటోలను శుభ్రంగా కడగాలి. మొదలు తీసేసి పెద్ద ముక్కలుగా తరిగి తొక్క తీసేయాలి.

అల్లం, వెల్లుల్లి పొట్టు వలిచి తరగాలి. మిర్చిని నిలువుగా చీరి గింజలు తీసేయాలి.

కిస్‌మిస్‌ కడిగి పక్కన ఉంచాలి.

సాస్‌ను నిల్వ చేసే సీసాను శుభ్రం చేసి తేమపోయే వరకు వేడి చేసి పక్కన ఉంచాలి.

ప్రెషర్‌ కుక్కర్‌లో టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కిస్‌మిస్, వినెగర్, ఉప్పు, చక్కెర వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి

టొమాటో ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మిశ్రమాన్ని పెద్ద చిల్లులున్న స్ట్రెయినర్‌లో వడపోయాలి.

ఇందులో సోడియమ్‌ బెన్‌జోయేట్‌ కలిపిన నీటిని వేసి కలపాలి.

ఈ టొమాటో సాస్‌ చల్లారిన తరవాత సీసాలో వేసి మూత పెట్టాలి.

ఒకటి – రెండు రోజుల తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. దీనిని సైడ్‌ డిష్‌గా తీసుకోవచ్చు.

ఆకలి వేయడానికి భోజనానికి ముందు ఒక స్పూన్‌ చప్పరించవచ్చు. అలాగే నాలుక రుచి కోల్పోయినప్పుడు కూడా ఒక స్పూన్‌ చప్పరించవచ్చు.