సులభంగా రుచికరమైన పోహప్పడం!

కావలసినవి: అటుకులు – మూడు కప్పులు, ఇంగువ – పావు టీస్పూను, బేకింగ్‌ సోడా – ఒకటింబావు టీస్పూన్లు

కారం – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, బియ్యప్పిండి –డస్టింగ్‌కు సరిపడా.

తయారీ... ముందుగా ఒకటిన్నర కప్పుల నీటిని పాత్రలో పోసుకోవాలి.

అందులో ఇంగువ, బేకింగ్‌ సోడా, కారం, ఉప్పు వేసి కలిపి మరిగించి పక్కన పెట్టుకోవాలి.

అటుకులను దోరగా వేయించి చల్లారనివ్వాలి. చల్లారాక పిండిలా గ్రైండ్‌ చేయాలి.

అటుకుల పిండిలో మరిగించి పెట్టుకున్న నీటిని వేసి చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి.

పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పలుచగా గుండ్రంగా వత్తుకోవాలి.

వీటిని నాలుగు రోజుల పాటు ఎండబెట్టాలి.

ఎండిన వాటిని గాలిచొరబడని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి.