పిస్తా ఓట్స్‌ చిక్కి తయారీ ఇలా

కావలసినవి: పిస్తా పలుకులు – కప్పు

ఓట్స్‌ – కప్పు

ఉప్పు – అర టీస్పూను

మేపుల్‌ సిరప్‌ – పావు కప్పు

ఆలివ్‌ నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు

ఎండుకొబ్బరి ముక్కలు – ముప్పావు కప్పు

తయారీ: ∙ముందుగా పిస్తా, ఓట్స్‌ను దోరగా వేయించాలి.

వీటిలో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి

ఈ మిశ్రమంలో ఆలివ్‌ ఆయిల్ వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి

మేపుల్‌ సిరప్‌ను కూడా వేసి కాస్త ముద్దగా ఉన్న మిశ్రమాన్ని బేకింగ్‌ ట్రేలో పోసి పైన కొబ్బరి ముక్కలు చల్లి ట్రేను పదిహేను నిమిషాలపాటు అవెన్‌లో పెట్టాలి

ఎండుకొబ్బరి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారాక తీసేసి చల్లారనిచ్చి ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌చేసుకోవాలి

ఈ ముక్కల్ని (చిక్కీలను) ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేస్తే వారంపాటు చక్కగా నిల్వ ఉంటాయి.