నోరూరించే పనీర్‌ పకోడా

కావలసినవి: పనీర్‌ ముక్కలు – 400 గ్రాములు

గ్రీన్‌ చట్నీ కోసం అర కప్పు కొత్తిమీరతో..

లేదంటే పుదీనాతో తయారు చేసి పెట్టుకోవాలి

టొమాటో సాస్‌ – పావు కప్పు

శనగపిండి – పావు కప్పు(ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసుకుని పకోడా పిండిలా కలుపుకోవాలి

నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా పనీర్‌ ముక్కల్ని కట్‌ చేసుకోవాలి

.. రెండు ముక్కల మధ్యలో గ్రీన్‌ చట్నీ

టొమాటో సాస్‌ పెట్టుకుని.. శనగపిండిలో ముంచాలి

నూనెలో దోరగా వేయించుకోవాలి.

వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పకోడా.