నారింజలో విటమిన్‌ సి, ఎ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు ఉన్నాయి.

ఆరంజ్‌ కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది.

మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది.

ఆరంజ్‌లో బెటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇందులో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది.

ఆరంజ్‌లో ఉండే పోలిక్‌ యాసిడ్‌ మెదడును బ్యాలెన్స్‌గా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది.

మొటిమలపై నారింజ రసం రాసుకుంటే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది

తరచూ జలుబు చేసే వారు ఆరంజెస్‌ తింటుండడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, జలుబు సమస్య దానంతట అదే తొలగుతుంది.