ఆరోగ్యకరమైన, కరకరలాడే మిల్లెట్‌ మురుకుల తయారీ విధానం

కావలసినవి: ఊదలు – కప్పు

బియ్యప్పిండి – అరకప్పు

పుట్నాల పొడి – అరకప్పు

నూనె – వేయించడానికి సరిపడా

వాము – టీస్పూను

వెన్న – అరటేబుల్‌ స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

తయారీ: ∙ఊదలను దోరగా వేయించి పిండిపట్టుకోవాలి

ఒకగిన్నెలో ఊదలపిండితోపాటు మిగతా పదార్థాలన్ని వేయాలి

రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లుపోస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి ∙

పది నిమిషాల పాటు పిండిని నానబెట్టి, తరువాత మురుకుల్లా వత్తుకుని గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు నూనెలో వేయించి తీసేయాలి

చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకుని స్నాక్‌గా సర్వ్‌చేసుకోవచ్చు.