మరమరాలు పాలకూర వడ తయారీ ఇలా

కావలసినవి: మరమరాలు – 2 కప్పులు (నానబెట్టి, నీళ్లు లేకుండా చేసి.. పెద్ద వడకట్టులో వేసుకుని.. 2 నిమిషాల తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి)

పాలకూర – 1 కప్పు (చిన్నగా తరగాలి)

ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు

పచ్చిమిర్చి ముక్కలు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌ చొప్పున

జీలకర్ర పొడి

ధనియాల పొడి

కారం – అర టీ స్పూన్‌ చొప్పున

నిమ్మరసం – 1 టేబుల్‌ స్పూన్‌

కొత్తిమీర తురుము

నువ్వులు

నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున

శనగపిండి – 1 కప్పు

పసుపు – కొద్దిగా

ఉప్పు –తగినంత

నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా నానబెట్టిన మరమరాల్లో.. పాలకూర తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి.

అందులో కారం, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

అందులో జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర తురుము, నువ్వులు, నీళ్లు, శనగపిండి వేసుకుని.. కలుసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.

ర తురుము, నువ్వులు, నీళ్లు, శనగపిండి వేసుకుని.. కలుసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్‌ మరమరాలు–పాలకూర మిశ్రమం తీసుకుని.. చేత్తో చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకుని.. కాగుతున్న నూనెలో ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.