రెయిన్‌ బో ఫ్రూట్‌ సలాడ్‌ తయారీ ఇలా

కావలసినవి: స్ట్రాబెర్రీలు – 2 కప్పులు (శుభ్రం చేసి సగానికి కట్‌ చేయాలి)

కర్బూజ ముక్కలు – 2 కప్పులు

బ్లూ బెర్రీలు – కప్పు

కివీ పండ్లు – 2 (తొక్క తీసి పలుచగా ముక్కలు చేయాలి)

బొప్పాయి పండు (ముక్కలు చేయాలి)

రాస్ప్‌ బెర్రీలు – కప్పు

తయారీ: ఈ ముక్కలను చక్కగా ఫొటోలో ఉన్నట్లు ఇంద్రధనుస్సు ఆకారంలో అమర్చాలి.

ఫ్రూట్‌ సలాడ్‌ ప్లేట్‌ని ఇలా చూస్తే ఎవరికైనా ఒక ముక్క తినాలనిపిస్తుంది.

మనకు అందుబాటులో ఉన్న అరటిపండు, యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లతోనూ సరదాగా ఇంద్ర ధనుస్సును అమర్చుకోవచ్చు.