ఓవెన్‌, గిన్నెల లోని జిడ్డు, మరకలు పోవాలంటే

అవెన్‌ చల్లబడిన తరువాత మరకలపై ఉప్పు నీటిని చల్లి తుడవాలి. 

గిన్నె అడుగు మాడినప్పుడు దాంట్లో కొద్దిగా డిష్‌ సోప్‌, నీళ్ళు పోసి కొంచెం సేపు చిన్న మంట మీద ఉంచి తరువాత కడిగితే శుభ్రపడుతుంది.

గిన్నెలు తళతళ మెరవాలంటే తోమడానికి వాడే పొడి లేదా సబ్బుకి 1, 2 టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ కలిపి తోమితే గెన్నె జిడ్డుని వదలగొట్టి మెరిసేలా చేస్తుంది.

పచ్చి బఠాణి ఉడికించేటప్పుడు కొద్దిగా చక్కెర వేస్తే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. రుచి కూడా ఇనుమడిస్తుంది.

చిన్న కప్పులో సోడా బై కార్బనేట్‌ వేసి ఫ్రిజ్‌లో ఒక పక్కగా ఉంచితే వంటల వాసనలను పీల్చుకుంటుంది. ఒకదాని తాలూకు వాసన మరొక దానికి పట్టదు.

ఆకు కూరలను న్యూస్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

అరటికాయ చిప్స్‌ కరకరలాడాలంటే వేయించేటప్పుడు ముక్కల మీద ఉప్పు నీటిని చిలకరించాలి.