కాబూలీ చనా బిర్యానీ తయారీ ఇలా

కావలసినవి: బియ్యం – రెండున్నర కప్పులు

తరిగిన కొత్తిమీర – పావు కప్పు

కుంకుమ పువ్వు– పావు టీ స్పూన్

వెన్న తీసిన పాలు – పావు కప్పు

ఉప్పు– రుచికి తగినంత

గ్రేవీ కోసం... ఉడికించిన తెల్ల శనగలు – ముప్పావు కప్పు

నూనె– రెండు టీ స్పూన్‌లు

అల్లం పేస్ట్‌– టీ స్పూన్

వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్

కారం పొడి – టీ స్పూన్, పసుపు– అర టీ స్పూన్

టొమాటో ముక్కలు– ముప్పావు కప్పు

పచ్చి మిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్‌

మీగడ లేని పెరుగు – పావు కప్పు (చిలకాలి)

తయారీ: స్టవ్‌ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలి

ఇప్పుడు కారం పొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా నీరు పోసి అర నిమిషం పాటు ఉడికించి, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, శనగలు వేసి కలుపుతూ మీడియం మంట మీద ఉడికించి

దించే ముందు పెరుగు వేసి కలపాలి. ఈ గ్రేవీని పక్కన ఉంచాలి.

బిర్యానీ తయారీ: కుంకుమ పువ్వును వేడి పాలలో వేసి నాననివ్వాలి.

అన్నం వండి అందులో కొత్తిమీర, ఉప్పు, కుంకుమపువ్వు పాలు వేసి జాగ్రత్తగా (అన్నం ముద్ద కాకుండా) కలపాలి.

ఇప్పుడు అన్నం మిశ్రమం సగం తీసుకుని వెడల్పు (ఒవెన్‌లో పట్టేటట్లు)పాత్రలో పరిచినట్లు అమర్చాలి. అన్నం మీద కాబూలీ చనా గ్రేవీ సమంగా వేయాలి. మిగిలిన సగం అన్నం మిశ్రమాన్ని గ్రేవీ పైన సర్దాలి.

పాత్ర అంచులకు అల్యూమినియం ఫాయిల్‌ తో సీల్‌ చేసి ఒవెన్‌లో 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో 20 నిమిషాల పాటు ఉంచాలి. కాబూలీ చనా బిర్యానీ రెడీ.