రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న పొంగనాలు

కావలసినవి: జొన్న పిండి – 1 కప్పు

మినపప్పు – అర కప్పు (రెండు గంటలు నాబెట్టుకోవాలి)

నీళ్లు – సరిపడా

జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌

ఉప్పు – తగినంత

ఉల్లిపాయ ముక్కలు

క్యారెట్‌ తురుము

బీట్‌ రూట్‌ తురుము

కొత్తిమీర తురుము – ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున (ఇలా నచ్చినవి ఇందులో కలుపుకోవచ్చు)

తయారీ: ముందుగా మినపప్పు మిక్సీలో వేసుకుని.. మిక్సీ పట్టుకోవాలి.

అనంతరం ఒక బౌల్‌ తీసుకుని.. మిక్సీ పట్టిన మినప్పిండి, జొన్న పిండి, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి.

అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, అభిరుచిని బట్టి ఇతర తురుములు కలుపుకోవాలి. దీనిని కాసేపు పక్కన పెట్టుకోవాలి.

అనంతరం గుంత పొంగనాల ప్లేట్‌ తీసుకుని.. నూనె పూయాలి

ప్రతి గుంతలో కొంత జొన్న మిశ్రమాన్ని వేసుకుని.. ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.