కొన్ని ప్రయాణాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో అంతే భయం గొల్పుతాయి.

ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరంగా పేరున్న ‘నంగా పర్బత్‌’ పై జర్నీ కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది.

పాకిస్తాన్‌లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది.

ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్‌ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు).

నంగా పర్బత్‌ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం.

1953లో హెర్మన్‌ బుహ్ల్‌ (ఆస్ట్రియన్‌ జర్మన్‌) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు.

ఈ పర్వతం నిటారుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కడం చాలా కష్టం.

20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్‌ పర్వతం’ అనే పేరూ వచ్చింది.

ఇది చాలా ఇరుకైన రహదారి కావడంతో దీని మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది. ఈ క్యాంప్‌ను మోస్ట్‌ డేంజరెస్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ టూర్‌ అంటారు పర్వత పర్యాటక ప్రియులు.