టొమాటో సూప్‌ తయారీ చేసుకోండిలా

కావలసినవి: టొమాటోలు – అర కేజీ, వెన్న – 2 టేబుల్‌ స్పూన్‌లు

బిర్యానీ ఆకులు– 2

ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు

వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్‌

మామూలు నీరు లేదా కూరగాయలు ఉడికించిన నీరు – 100 మి.లీ

ఉప్పు– రుచికి తగినంత

చక్కెర – టీ స్పూన్‌

మిరియాల పొడి– రుచికి తగినంత.

గార్నిష్‌ కోసం: బ్రెడ్‌ క్యూబ్‌లు– అర కప్పు

ఆలివ్‌ ఆయిల్‌– టేబుల్‌ స్పూన్‌

ఉప్పు – తగినంత ; మిరియాల పొడి– చిటికెడు ; కొత్తిమీర తరుగు– టేబుల్‌ స్పూన్‌

మీగడ– 2 టేబుల్‌ స్పూన్‌లు

తయారీ: ∙టొమాటోలను కడిగి ముక్కలుగా తరగాలి. ∙బాణలిలో వెన్న వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేయించాలి.

ఇందులో టొమాటో ముక్కలు వేసి కలిపి, మంట తగ్గించి మూత పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడిన తరవాత దించేసి చల్లారనివ్వాలి.

∙చల్లారిన తరవాత బిర్యానీ ఆకు తీసి వేసి మిగిలిన మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్‌ చేసి వడపోయాలి.

ఇలా వడపోసిన ప్యూరీని ఒక పాత్రలో పోసి చక్కెర, కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. ఉడికే దశకు చేరేటప్పుడు మీగడ, మిరియాల పొడి వేసి దించేయాలి.

బాగా కలిపి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాల పొడి కలపాలి.

బ్రెడ్‌ ముక్కల మీద ఆలివ్‌ నూనె, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.

నూనెను బ్రెడ్‌ ముక్కలు పీల్చుకున్న తర్వాత అవెన్‌లో 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు నిమిషాల పాటు ఉంచితే కరకరలాడతాయి.

కప్పులో టొమాటో సూప్‌ తీసుకుని పైన కొత్తిమీర తరుగు, మీగడ వేసి, పక్కన బ్రెడ్‌ ముక్కలు పెట్టి సర్వ్‌ చేయాలి. రెస్టారెంట్‌లో ఉన్నట్లే ఉంటుంది.