వెరైటీగా కొత్తిమీరతో బజ్జీ ట్రై చేయండిలా!

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తురుము: అర కప్పు

శనగపిండి – 1 కప్పు

ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు

అల్లం తురుము – పావు టీ స్పూన్‌

వెల్లుల్లి – 2 (కచ్చాబిచ్చాగా చేసుకోవాలి)

కారం – 1 టీ స్పూన్‌

పచ్చిమిర్చి ముక్కలు: నాలుగు

పసుపు

గరం మసాలా: కొద్దికొద్దిగా, నీళ్లు

నూనె – సరిపడా

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో శనగపిండి, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి.

అనంతరం ఆ మిశ్రమంలో కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా చేసుకోవాలి.

తర్వాత కళాయిలో నూనె పోసుకుని.. కాగిన తర్వాత.. కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని బజ్జీల్లా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అంతే కొత్తిమీర బజ్జీ రెడీ