పొటాటో పాపడ్‌.. తయారీ ఇలా!

కావలసినవి: బంగాళ దుంపలు – కేజీ, బియ్యప్పిండి – రెండు కప్పులు ఉప్పు – టీస్పూను.

కారం – టీస్పూను, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – రెండు టీస్పూన్లు.

తయారీ.. ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి కుకర్‌ గిన్నెలో వేయాలి.

దీనిలో రెండు కప్పుల నీళ్లు పోసి, ఒక విజిల్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.

విజిల్‌ వచ్చాక 5 నిమిషాలపాటు మీడియం మంటమీద మెత్తగా ఉడికించాలి.

దుంపలు చల్లారాక తొక్క తీసి, మెత్తగా చిదుముకుని, బియ్యప్పిండిలో వేయాలి.

దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర వేసి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి.

చేతులకు కొద్దిగా ఆయిల్‌ రాసుకుని దుంప మిశ్రమాన్ని ఉండలు చేయాలి.

పాలిథిన్‌ షీట్‌కు రెండు వైపులా ఆయిల్‌ రాసి మధ్యలో ఉండ పెట్టి పలుచగా వత్తుకుని ఎండబెట్టాలి.

రెండు వైపులా ఎండిన తరువాత గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.