కావలసినవి: కప్పు-గోధుమ రవ్వ, అరకప్పు-ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, అరకేజీ-తొక్కతీసిన పనసకాయ ముక్కలు

ఉప్పు – రుచికి సరిపడా, టీస్పూను-కారం, టేబుల్‌ స్పూను-మిరియాలు, పుదీనా తరుగు , కొత్తిమీర తరుగు , నిమ్మరసం, పెరుగు

రెండు- యాలకులు, అంగుళం ముక్క-దాల్చిన చెక్క, అర టీస్పూను-తోకమిరియాలు, నాలుగు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు – ఒకటి

ఉల్లిపాయ తరుగు – నాలుగు కప్పులు, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – రెండు కప్పులు.

తయారీ: పప్పులన్నింటిని విడివిడిగా శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి

పనసకాయ ముక్కల్లో పెరుగు, ఉప్పు, నిమ్మరసం వేసి గంటపాటు నానబెట్టుకోవాలి.

బాణలిలో కప్పు నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి.

వేడెక్కిన తరువాత నానబెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇదే బాణలిలో ఉల్లిపాయ తరుగును కూడా గోల్డెన్‌ కలర్‌లో క్రిస్పీగా వేయించి టిష్యూ పేపర్‌ మీద వేసుకోవాలి

ఇప్పుడు ఒక పాత్రలో నాలుగు గ్లాసుల నీళ్లు, అన్ని మసాలా దినుసులు, ఉప్పు వేసి మరిగించాలి

టేబుల్‌ స్పూను నెయ్యివేసి పప్పులను దోరగా వేయించి, పొడిచేసుకోవాలి

కుకర్‌ గిన్నెలో వేయించిన పనస ముక్కలు పప్పు పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి.

వేయించిన ఉల్లిపాయతరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి కలపాలి.

దీనిలో మరిగించి పెట్టుకున్న మసాలా నీళ్లు పోసి ఆరేడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించి, తరువాత గ్రైండ్‌ చేసుకోవాలి.

ఈ మిశ్రమంలో మిగిలిన నెయ్యి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.