టేస్టీ.. టేస్టీ.. ఎగ్‌ కుకీస్‌!

కావలసినవి: గుడ్లు – 4 (కేవలం పసుపు సొన మాత్రమే తీసుకోవాలి)

గోధుమ పిండి –125 గ్రాములు, మొక్కజొన్న పిండి – 10 గ్రాములు

బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూన్‌

బటర్‌ – 85 గ్రాములు (కరిగించాలి)

పంచదార పొడి – 40 గ్రాములు

నల్ల నువ్వులు – గార్నిష్‌కి సరిపడా, నూనె – కొద్దిగా

తయారీ విధానం: ముందుగా ఉడికిన గుడ్డు పసుపు సొనలను పొడిపొడిగా చేసుకోవాలి.

అందులో 2 టీ స్పూన్లు తీసి పక్కన పెట్టుకుని.. మిగిలిన దాన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి.

అదే బౌల్‌లో గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్, పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి.

అనంతరం బటర్‌తో ముద్దలా చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలా గట్టిగా చేసుకోవాలి.

చపాతీ కర్రతో ఒత్తుకుని.. అర అంగుళం మందం ఉండేలా ఒత్తుకోవాలి. తర్వాత దాన్ని గుండ్రటి కుకీస్‌ బిట్స్‌లా తీసుకుని.. బేకింగ్‌ ట్రేలో పరచాలి.

అనంతరం కుకీస్‌కి బ్రష్‌తో నూనె రాసి.. ప్రతిదానిపైన పక్కనే ఉంచిన పసుపు సొనను కొద్దికొద్దిగా గార్నిష్‌ చేసుకుని.. కొద్దికొద్దిగా నల్లనువ్వులు వేసుకోవాలి.

తర్వాత 15 నిమిషాల పాటు ఓవెన్‌ లో బేక్‌ చేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన ఎగ్‌ కుకీస్‌ రెడీ!