కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి)

గుడ్లు – 4 లేదా 5

ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌(చిన్నగా కట్‌ చేసుకోవాలి)

పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్‌(చిన్నగా కట్‌ చేసుకోవాలి)

ఉప్పు –తగినంత

పసుపు – చిటికెడు

కారం – 1 టీ స్పూన్‌

చిక్కటిపాలు – 1 టేబుల్‌ స్పూన్‌

తయారీ: ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.

తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి.

అనంతరం రెండు స్టవ్‌లు ఆన్‌ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్‌ వేసుకోవాలి.

చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్‌పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్‌ చేసుకోవాలి.