నోరూరించే బనానా పీనట్‌ చాక్లెట్‌

కావల్సిన పదార్థాలు: అరటిపండ్లు – 5 లేదా 6

దాల్చిన చెక్కపొడి – చిటికెడు

చాక్లెట్‌ చిప్స్‌ – పావు కప్పు

కొబ్బరి నూనె – పావు టేబుల్‌ స్పూన్‌

తేనె – 4 టేబుల్‌ స్పూన్లు

పీనట్‌ బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం: ముందుగా చాక్లెట్‌ చిప్స్‌లో కొబ్బరి నూనె వేసుకుని.. క్రీమ్‌లా మారేలా మెల్ట్‌ చేయాలి

అరటిపండ్లను గుండ్రటి చక్రాల్లా కట్‌ చేసుకోవాలి.

తేనెలో దాల్చిన చెక్కపొడి వేసి బాగా కలిపి.. అందులో అరటిపండు ముక్కలు వేసుకుని అటూ ఇటూ తిప్పాలి.

అనంతరం రెండేసి అరటిపండు ముక్కలను తీసుకుని.. మధ్యలో కొద్దికొద్దిగా పీనట్‌ బటర్‌ రాయాలి.

అనంతరం ఆ రెండు ముక్కల్ని కలిపి.. చాక్లెట్‌ మిశ్రమంలో ముంచి.. బాగా పట్టించి.. ఆరనివ్వాలి.

అంతే చాక్లెట్‌ క్రీమ్‌.. గట్టిపడిన తర్వాత సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి