డెలివరీ తర్వాత చాలామందికి పొట్ట మీద చర్మం ముడతలు పడి చారలు వస్తాయి.

ఈ చారల సమస్య కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది.

వీటిని కొన్ని చిట్కాలతో పరిష్కరించుకోవచ్చు. అవేమిటంటే..

స్నానం చేయడానికి ముందు కాస్త ఆముదాన్ని గోరువెచ్చగా చేసుకుని చారలు ఉన్న చోట సున్నితంగా మర్దన చేయాలి.

గంట సేపటి తర్వాత స్నానం చేయాలి.

ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే నెల తిరిగేసరికి మంచి ఫలితం కనిపిస్తుంది.

లేదంటే... ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బాదం నూనెతో చారలపై మర్దన చేసుకోవాలి.

మరునాడు ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేసి, చారలపై కలబంద గుజ్జు రాసుకోవాలి.

ప్రతిరోజూ ఇలా చేస్తే నాలుగైదు వారాల్లోనే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.