తేనెతో సహజసిద్ధ నిగారింపు

రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి చక్కగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి.

బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకుంటే చర్మానికి ఎంతో మంచిది.

దీని వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్‌ తగ్గుముఖం పడుతుంది.

రోజ్‌ వాటర్‌ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది.