బాగా పండిన సపోటాలు రెండు తీసుకుని తొక్కతీసి మెత్తగా చేయాలి.

టేబుల్‌ స్పూను తేనె, టేబుల్‌ స్పూను పంచదార వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి.

తరువాత ఐదునిమిషాలు మర్దన చేసి కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల చర్మానికి యాంటీ ఆక్సిడెంట్స్, వివిధ రకాల పోషకాలు అంది ముఖ వర్ఛస్సు మెరుగుపడుతుంది.

అరకప్పు ఆపిల్‌ ముక్కల్లో రెండు టేబుల్‌ స్పూన్ల పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌ పొడి వేసి పేస్టులా చేయాలి.

ఈ పేస్టుని ముఖానికి, మెడకు అప్లై చేసి అరగంట తరువాత కడిగేయాలి.

ఇది మంచి స్క్రబ్‌గా పనిచేసి, చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగిస్తుంది.