విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి.

ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్‌ ఎ తగినంత ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు.

క్యారట్లు: విటమిన్‌ ఏ కి ఉత్తమ ఆహారం క్యారట్లు. క్యారట్‌ హల్వా అందరికీ ఇష్టమే

కానీ, క్యారట్స్‌ లో ఉన్న పోషకాలు మనకి అందాలంటే మాత్రం పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్‌ తీసుకుని తాగచ్చు.

చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు.

లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్‌ కూడా బాగుంటాయి. తక్కువ మోతాదులో పచ్చివి తిన్నా మంచిదే.

ఆకు కూరలు: ఒకప్పుడు ఆకుకూరలు లేని భోజనం ఉండేది కాదు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు ముందు ఆకు కూరలే తినమనేవాళ్ళు కూడా.

అయితే, ఆకు కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది.

గుమ్మడికాయ: తియ్య గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తియ్య గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా.

ఒక్క పులుసే కాదు, తియ్య గుమ్మడి తో సూప్స్, పైస్, స్నాక్స్‌ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉంటుంది.

పాలు: మనందరం చిన్న పిల్లలకి రెగ్యులర్‌ గా ఒక గ్లాస్‌ పాలు ఇస్తాం. పాలలో కాల్షియమే కాదు విటమిన్‌ ఏ కూడా ఉంటుంది.

పిల్లలతో పాటూ పెద్ద వాళ్ళు కూడా ఒక గ్లాస్‌ పాలు తాగడం వల్ల ఎన్నో డిసీజెస్‌ నించి రక్షింపబడతాం.

టొమాటో: టొమాటో మన వంటల్లో నిత్యం ఉండే పదార్ధమే. పప్పు, కూర, రసం, పచ్చడి ఎందులోనైనా అందులో కొంచెం టొమాటో ఉంటే వచ్చే రుచే వేరు.

విటమిన్‌ ఏ మాత్రమే కాక టొమాటో లో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలం గా ఉన్నాయి.

విటమిన్‌ ఎ ను పొందడం కోసం ట్యాబ్లెట్లు, ఇతర సప్లిమెంట్లపై ఆధార పడటం కన్నా, అది మెండుగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.