కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే ఉపశమనం కలుగుతుంది.

నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది.

ఇందులో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది.

నారింజ కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్ష పండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం.

దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది.

ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది.

ఇందులో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులని తగ్గిస్తాయి.