హైపో థైరాయిడిజమ్‌ అనేది అనారోగ్యం కాదు, థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ (టీఎస్‌హెచ్‌) దేహానికి తగినంతగా అందని స్థితి.

అలాగే హైపర్‌ థైరాయిడిజమ్‌ అంటే ఆ హార్మోన్‌ అవసరానికి మించి అందడం అన్నమాట.

ఆహారంలో అందాల్సిన సూక్ష్మ పోషకాలు అందకపోవడం కూడా ఒక కారణమే.

మరి హైపో థైరాయిడిజమ్‌ ఉన్నవాళ్లు ఏం తినాలి?

హైపో థైరాయిడిజమ్‌ నుంచి బయటపడడానికి అయోడిన్‌ అనే ఖనిజం చాలా అవసరం.

అన్ని రకాల చేపలు (పఫర్‌ ఫిష్‌ వంటి విషపూరితం కాని), గుడ్లు, పాలు–పాల ఉత్పత్తుల్లో అయోడిన్‌ సమృద్ధిగా ఉంటుంది.

అలాగే వంటల్లో అయోడిన్‌తో కూడిన ఉప్పు వాడడం మంచిది.

అలాగే సెలీనియం బ్రెజిల్‌ నట్స్‌ (డ్రై ఫ్రూట్స్‌ దుకాణంలో ఈ పేరుతోనే లభిస్తాయి) రోజుకు రెండు తినాలి.

రోజూ ఒక స్పూన్‌ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి.

వెజ్‌ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి – రెండుసార్లు తీసుకోవాలి.

స్ట్రాబెర్రీ, పీచ్‌ పండ్లను మినహాయించి మిగిలిన అన్ని పండ్లనూ తీసుకోవాలి.

ప్రధాన ఆహారంగా మామూలుగానే అన్నం, గోధుమ రొట్టెల వంటివి తీసుకోవచ్చు.

తెల్లసొన, పచ్చసొన అనే విభజన లేకుండా గుడ్డు మొత్తాన్ని తీసుకోవాలి.