ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే... కొద్దిసేపు ఊపిరి బిగబట్టాలి.

ఇలా కాసేపు బిగబట్టాక మళ్లీ గాఢంగా శ్వాస తీసుకుని, వదిలి... మరోసారి బిగబట్టాలి.

ఇలా శ్వాస తీసుకుంటూ... బిగబడుతూ... ఈ ప్రక్రియను కాసేపు కొనసాగిస్తే ఎక్కిళ్లు ఆగుతాయి.

గబగబా ఊపిరి తీసుకుంటూ ఉండటం కూడా ఓ పద్ధతి. ఓ రెండు నిమిషాల పాటు ఇలా చేయాలి. ఎక్కిళ్లు ఆగాక మళ్లీ మామూలుగానే ఊపిరి తీసుకోవాలి.

రిలాక్స్‌డ్‌గా కూర్చుని... ఆ తర్వాత మోకాలిని ఛాతీ వరకు తెచ్చి... అలా కాసేపు దాన్ని ఛాతీకి ఆనించి ఉంచాలి.

ఆకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయంటారు గానీ అది అంత మంచిది కాదు.

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నవారు గ్లాసులోని నీళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి

కొద్దిగా చక్కెర వేసిన నీళ్లతో మరింత ప్రభావం ఉంటుంది.

ఒక స్పూను చక్కెరను నోటిలో వేసుకుని చప్పరించడం, యాలుక్కాయను తినడం, ఖాళీ కవర్‌లోకి గాలిని ఊదడం వంటి వాటివల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయంటారు.

ఈ కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.