ఎముకలు దృఢంగా ఉండాలంటే డైట్‌లో ఖార్జూరాలు చేర్చుకుంటే మంచిది

పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి

ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి.

వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించాలి.

ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి.

వీటితో పాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్‌ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

కేవలం ఎముకల బలానికే కాదు ఖర్జూరాలు తినడం వల్ల ఇందులోని ఫినోలిక్ ఆసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధుల‌ను దూరం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.