ఆరోగ్యానికి మజ్జిగ మంచిదని రోజుకి కనీసం ఒకగ్లాసు అయినా తాగుతుంటాం.

అయితే మజ్జిగ జుట్టు, చర్మ సంరక్షణలో చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చుండ్రుని తగ్గించి, జుట్టుని ఒత్తుగా పెంచడం, మొటిమలను మాయంచేసి చర్మాన్ని మెరిపించడంలో మజ్జిగ చక్కగా పనిచేస్తుంది.

ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే మజ్జిగను ఈ విధంగా వాడాలి..

చుండ్రు సమస్య తీవ్రంగా ఉండి పదేపదే విసిగిస్తుంటే ..పుల్లటి మజ్జిగను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.

అరగంట తరవాత కడిగేయాలి.

వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల మాడుకు తేమ అంది చుండ్రు సమస్య తగ్గుతుంది.

జుట్టు పలుచగా నిర్జీవంగా అనిపిస్తే... శనగపిండిలో ఆలివ్‌ ఆయిల్, మజ్జిగ వేసి కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి మర్దన చేయాలి.

అరగంట తరువాత షాంపు, గోరువెచ్చని నీటితో కడిగేయాలి.