జామ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే.

అయితే, జామ ఆకుల గురించి ఈ ఉపయోగాలు తెలుసా?

జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి.

జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి.

సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాల సేపు మరిగించాలి.

చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా పట్టిస్తూ బాగా మర్దనా చేయాలి.

గంట తరువాత తలస్నానం చేయాలి.

తరచు ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.