జామపండు ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

జామలో విటమిన్‌- సీ అధికం.

జామలో పొటాషియమ్‌ ఎక్కువ. తద్వారా రక్తపోటును సమర్థంగా నివారించగలుగుతుంది.

జామలో ‘లైకోపిన్‌’ అనే అద్భుత పోషక మోతాదులు ఎక్కువే అని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

జామలో లైకోపిన్‌ ఉన్నందున ఈసోఫేజియల్‌ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో దోహదపడుతుంది.

మగ్గిన జామపండులో పీచు పదార్థం చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తగ్గుతుంది.

సుమారుగా 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది.

ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా ఉపయోగకరం.

ఇలాంటి అనేక గుణాలున్నందున జామను ఆరోగ్యానికి ఖజానా పిలవచ్చు. ఏమంటారు?